: ఢిల్లీలో పోలీసులు రెండు రకాలు!


దేశ రాజధాని ఢిల్లీలో రెండు రకాల పోలీసులు ఉందురు. వారు 'ఎల్జీ పోలీసులు', 'కేజ్రీ పోలీసులు'... ఇకపై పిల్లలకు ఇలా పాఠాలు చెప్పాలేమో! ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్ ఒకరిని నియమిస్తే, ఆయన పైఅధికారిగా మరో ఆఫీసర్ ను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నియమిస్తున్నారు. దీంతో కింది స్థాయి సిబ్బంది ఎవరి మాట వినాలో తెలియక, వారు కూడా రెండు గ్రూపులుగా విడిపోయారు. తాజాగా ఢిల్లీ యాంటీ కరప్షన్ శాఖకు ఎస్.ఎస్.యాదవ్ ను కేజ్రీవాల్ హెడ్ గా నియమిస్తే, ప్రస్తుతం జాయింట్ కమిషనర్ గా ఉన్న ఎం.కే. మీనాను యాదవ్ కు పైఅధికారిగా జంగ్ నియమించారు. ఢిల్లీ పోలీసు విభాగంలోని మరో ఏడుగురిని ఏసీబీకి బదిలీ చేశారు. యాదవ్ కు మీనా సీనియర్ అధికారని ఉత్తర్వులు కూడా ఇచ్చారు. దీంతో ఢిల్లీ సర్కారుకు, లెఫ్టినెంట్ గవర్నరుకు మధ్య జరుగుతున్న పోరు మరింత ఉద్ధృతమైంది. ఏసీబీ విభాగంలో ఇప్పటివరకూ జాయింట్ కమిషనర్ అన్న పోస్టే లేదని, అందువల్ల మీనా నియామకం చెల్లదని ఆప్ ప్రభుత్వ పెద్దలు వాదిస్తున్నారు. 'ఈ వ్యవహారం ఇప్పట్లో తేలదులే' అనుకుంటూ పోలీసులు తమ విధులకు వెళ్తున్నారు.

  • Loading...

More Telugu News