: రేవంత్ ఇంట్లో ఏమీ దొరకలేదు: ఏసీబీ
తమ సోదాల్లో భాగంగా రేవంత్ రెడ్డి ఇంట్లో ఎటువంటి ఆధారాలూ లభించలేదని అవినీతి నిరోధక శాఖ అధికారులు వివరించారు. ఈ తెల్లవారుఝాము నుంచి జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంట్లో సోదాలు చేశామని ఏసీబీ డీఎస్పీ సునీతా రెడ్డి తెలియజేశారు. కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నామని, బ్యాంకు ఖాతాల వివరాలు, దస్తావేజులు, పాస్ పోర్టు వివరాలు అడిగామని ఆమె పేర్కొన్నారు. 'ఓటుకు నోటు' కేసుకు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలూ దొరకలేదని స్పష్టం చేశారు. కాగా, ఇదే సమయంలో ఈ కేసులో ఇతర నిందితుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే.