: రేవంత్ రెడ్డి ఇంటిలో ఏసీబీ సోదాలు... కుటుంబ సభ్యులపై ప్రశ్నల వర్షం
ఓటుకు నోటు కేసులో అరెస్టైన టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డిపై ఏసీబీ విచారణ మరింత ముమ్మరమైంది. జ్యూడిషియల్ కస్టడీలోని రేవంత్ రెడ్డిని కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మూడు రోజుల పాటు విచారించారు. నేటితో రేవంత్ ఏసీబీ కస్టడీ ముగియనుంది. ఈ క్రమంలో నేటి ఉదయం హైదరాబాదు, జూబ్లిహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అంతేకాక, ఈ కేసులో మరిన్ని వివరాల సేకరణ కోసమంటూ రేవంత్ కుటుంబ సభ్యులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో రేవంత్ తో పాటు అరెస్టైన సహ నిందితులు సెబాస్టియన్, ఉదయ సింహల ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.