: చేప మందు పంపిణీలో తొక్కిసలాట... రోగులు, పోలీసులకు గాయాలు


మృగశిర కార్తె నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి నుంచి బత్తిన సోదరుల చేప మందు పంపిణీ హైదరాబాదు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభమైంది. రెండు రోజుల ముందు నుంచే హైదరాబాదుకు వచ్చేసిన ఆస్తమా రోగులు చేప మందు కోసం ఎగబడ్డారు. టోకెన్ల జారీ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో పలువురు రోగులతో పాటు కొంతమంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి. తొక్కిసలాట నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు బాసులు అక్కడకు చేరుకుని భద్రతా చర్యలపై దృష్టి సారించారు. నేటి రాత్రితో చేప మందు పంపిణీ పూర్తి కానుంది.

  • Loading...

More Telugu News