: కూకట్ పల్లి మార్కెట్ లో అంతా చూస్తుండగా యువతి కిడ్నాప్
హైదరాబాదులోని కూకట్ పల్లిలో మంజూష అనే యువతి అందరూ చూస్తుండగా సినీ ఫక్కీలో కిడ్నాప్ కు గురైంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి హైదరాబాదులో బంధువుల ఇంటికి వచ్చిన మంజూష మార్కెట్ కి వెళ్లింది. ఇంతలో ఏపీ 28 టీవీఏ 0205 అనే ఇండికా కారులో వచ్చిన దుండగులు మంజూషను కిడ్నాప్ చేసి పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ కారు కోసం గాలింపు చేపట్టారు.