: తమిళ చిత్ర పరిశ్రమకు ధోనీ విజ్ఞప్తి


తమిళంలో వచ్చిన 'కాక ముట్టై' అనే చిత్రం జాతీయ అవార్డు గెలుచుకుంది. ఇద్దరు చిన్నారులకు పిజ్జా తినడమన్నది ఓ కల. ఆ కలను వారు ఎలా సాకారం చేసుకున్నారన్నదే చిత్ర ఇతివృత్తం. ఈ చిత్రంలో బాల హీరోలుగా నటించిన రమేశ్, విఘ్నేశ్ లకు రియల్ లైఫ్ లో ఓ కల ఉంది. టీమిండియా వన్డే సారథి మహేంద్ర సింగ్ ధోనీని కలవాలని వారు తహతహలాడిపోయేవారు. దీంతో, వారిద్దరినీ తీసుకుని చిత్ర దర్శకుడు మణికందన్ ముంబై వెళ్లి ధోనీని కలిశారు. విషయం తెలుసుకున్న ధోనీ ఆ చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి నేపథ్యం గురించి, సినిమా గురించి అడిగి తెలుసుకున్నారు. తమిళ చిత్రాల గురించి తెలుసుకునేందుకు ధోనీ ఎంతో ఆసక్తి ప్రదర్శించాడని మణికందన్ తెలిపారు. అంతేగాకుండా, తమిళ చిత్రాలు ఎంతో బాగుంటాయని, అయితే, వాటిని సబ్ టైటిల్స్ తో విడుదల చేస్తే అందరికీ అర్థం అవుతుందని అన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలోని అందరూ ఫిలిం మేకర్లకు సబ్ టైటిల్స్ తో సినిమాలు విడుదల చేయాలని చెప్పాలని మణికందన్ కు సూచించారు.

  • Loading...

More Telugu News