: జూలు విదిల్చిన వీరూ ... ఢిల్లీ తొలివిజయం!
ఎట్టకేలకు డాషింగ్ బ్యాట్స్ మ్యాన్ వీరేంద్ర సెహ్వాగ్ జూలు విదల్చడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ తొలి విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నాలుగు వికెట్లకు 161 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగుకు దిగిన ఢిల్లీ ఒకే ఒక వికెట్ (జయవర్ధనే 59)మాత్రమే నష్టపోయి 165 పరుగులు చేసి గెలుపొందింది. సెహ్వాగ్ 95 పరుగులతో అజేయంగా నిలిచాడు. జట్టు ఘనవిజయం సాధించడంతో ప్రధానపాత్ర పోషించిన వీరూకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.