: సీఐసీలో 40 వేల పెండింగ్ కేసులు
కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)లో 40 వేల కేసులు, దరఖాస్తులు, ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయని సీఐసీ వెల్లడించింది. తొమ్మిది నెలలుగా సీఐసీకి చీఫ్ కమిషనర్ లేకపోవడంతో ఫైళ్లు పేరుకుపోయాయి. ఈ రోజే సీఐసీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా విజయ్ శర్మను నియమించిన సందర్భంగా, ఆ శాఖ వివరాలు వెల్లడించారు. 40,051 కేసుల్లో 32,531 అప్పీళ్లు, 7,520 సమాచార హక్కు చట్టం దరఖాస్తులు ఉన్నాయని సీఐసీ వివరించింది. 15,736 అప్పీళ్లు, ఫిర్యాదులు చీఫ్ ఇన్ఫర్మేటివ్ కమిషనర్ బెంచ్ మీదే పెండింగ్ లో ఉన్నాయని సీఐసీ పేర్కొంది. మిగిలినవి సీఐసీలో ఏడుగురు కమిషనర్ ల వద్ద పెండింగ్ లో ఉన్నట్టు తెలిపింది.