: అదీ... నా విజన్ అంటే!: చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మహాసంకల్పం సభలో పలు అంశాలపై మాట్లాడారు. తన ఏడాది పాలనతో ప్రజల్లో విశ్వాసం కలిగించానని, అదీ తన విజన్ అంటే అని అన్నారు. అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటున్నానని చెప్పారు. ఏపీలో మిగులు విద్యుత్ ను సాధించామని, ఇతర రాష్ట్రాలకు అమ్మగలమని వివరించారు. తెలంగాణ కంటే 2 శాతం అధిక వృద్ధి రేటు సాధించామని గర్వంగా చెప్పారు. డ్వాక్రా, రైతు రుణమాఫీకి రూ.40 వేల కోట్లు ఇచ్చానని తెలిపారు. ఇక, మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత తనదేనని మరోసారి నొక్కి చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టకున్నా ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచామని అన్నారు. అన్ని వనరులను ఉపయోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ఆరేడేళ్లలో గోదావరి జలాలను రాష్ట్రం నలుమూలలకూ తీసుకెళతామని హామీ ఇచ్చారు. అన్ని కాల్వల నిర్మాణం పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. అమరావతిని భారత్ కు గేట్ వేగా చేస్తామని అన్నారు.