: అది చెట్టు కాదు...తాతగారి ఆరోప్రాణం
సాధారణంగా మనం కొన్నింటిపై మమకారం పెంచుకుంటాం. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అలాగే ఓ తాతగారికి కూడా మామిడి చెట్టు ప్రాణానికి ప్రాణంగా మారింది. చెట్టుమీదున్న మమకారంతో పెళ్లాం బిడ్డలను వదిలేసి చెట్టుపైనే జీవనం ఉంటున్నాడు. తను ఉండడానికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని చెట్టుపైనే నిద్ర, తిండి, ఇతర కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాడు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో హేమరాజ్ బుర్మాన్ (75) అనే వ్యక్తి గత 50 ఏళ్లుగా ఈ చెట్టుపైనే జీవనం ఉంటున్నాడు. ఆయన వినూత్న ఆలోచన ప్రకృతికి దగ్గరగా...బాగుంది కదూ!