: సీఎం పదవికి రాజీనామా చేసి నిప్పులాంటి వాడినని బాబు నిరూపించుకోవాలి: తలసాని


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబునాయుడు రాజీనామా చేసి నిప్పులాంటి మనిషినని నిరూపించుకోవాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాలు విసిరారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బాబు ఎప్పుడు లోపలికి వెళ్తారా? అని ఆ రాష్ట్ర మంత్రులు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఏసీబీ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి గురించి మాట్లాడేందుకు పరకాల ప్రభాకర్ ఎవరని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలకు చేతనైతే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సాక్ష్యాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News