: ఎలా పాడుతుందో అనుకున్నా...భలే పాడింది: శంకర్ మహదేవన్
బాలీవుడ్ అగ్ర కధానాయిక ప్రియాంకా చోప్రాను గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ పొగడ్తల్లో ముంచెత్తాడు. మలేసియాలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రియాంకా చోప్రా కొత్త సినిమా 'దిల్ ధడక్ నే దో' సినిమాలో టైటిల్ సాంగ్ పాడిందని చెప్పారు. టైటిల్ సాంగ్ పాడమని అడిగాం కానీ, ఎలా పాడుతుందో అనే టెన్షన్ మదిలో ఉండేదని శంకర్ మహదేవన్ చెప్పాడు. అయితే తమ అంచనాలకు భిన్నంగా అద్భుతంగా పాడిందని ప్రియాంకా చోప్రాను ప్రశంసించాడు. ఇదే సినిమాలోని 'గుల్లా గుడియా' అంటూ సాగే పాట ఈ వారం టాప్ సాంగ్స్ లిస్టులో అగ్రభాగం ఆక్రమించింది. కాగా, ఆదివారం జరిగిన ఐఫా అవార్డుల్లో కుమారుడు, బృందంతో శంకర్ మహదేవన్ ప్రదర్శన ఇచ్చాడు.