: నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రజలంతా అంకితం కావాలి: బాలకృష్ణ


నవ్యాంద్ర రాజధాని నిర్మాణానికి ఏపీ ప్రజలంతా అంకితం కావాలని ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ పిలుపునిచ్చారు. మంగళగిరిలో జరుగుతున్న మహాసంకల్పం సభలో బాలయ్య మాట్లాడుతూ, సంవత్సరం కాలంలో ప్రభుత్వం చేపట్టిన, చేయబోతున్న పనులను వివరించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలంతా సహకారంగా ఉండాలని కోరారు. పలు పథకాలు, పనులతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ పాలనలో మునుముందు ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని బాలయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News