: హీరోయిన్ నేను కాదు...మా అమ్మే!: దీపికా పదుకునే
సినిమాల్లో హీరోయిన్ గా నటించేది తానే అయినప్పటికీ, కుటుంబంలో హీరోయిన్ మాత్రం 'మా అమ్మే' అంటోంది ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునే. 'పీకూ' సినిమాలో నటనకు ఐఫా ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన తండ్రి ప్రముఖ క్రీడాకారుడు, సోదరి ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారిణి, తాను నటిని అయినప్పటికీ తన తల్లి తెరవెనుకే ఉండడానికి ఇష్టపడుతుందని చెప్పింది. అందరికీ స్ఫూర్తినిస్తూ అందరి విజయాలకు కారణమైనందుకు నిజమైన హీరోయిన్ తన తల్లి అని దీపికా పదుకునే చెప్పింది. కుటుంబానికి వెన్నెముకగా నిలిచి, తమ ఎదుగుదలకు కారణంగా తమ తల్లి నిలుస్తోందని దీపిక తల్లి గొప్పదనం వర్ణించింది.