: అమీనాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం: ప్రణబ్


మారిషస్ కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన అమీనా గురిబ్ ఫాకిమ్ కు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుభాకాంక్షలు తెలిపారు. అమీనా మారిషస్ కు తొలి మహిళా రాష్ట్రపతి కావడం విశేషం. కాగా, ఆమెను అభినందిస్తూ ప్రణబ్ ఓ సందేశం పంపారు. ఇరు దేశాల అభివృద్ధికి, సంబంధాల బలోపేతానికి ఆమెతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. భారత్, మారిషస్ దేశాలు ఒకే రకమైన సంప్రదాయాలు, ప్రజాస్వామ్య విలువలు కలిగి ఉన్నాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News