: ఇతర సమస్యలతో ముడిపెట్టి తప్పించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు: మైసూరా రెడ్డి
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు స్వయంగా మాట్లాడిన మాటలు విడుదల కావడంతో... మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని వైకాపా నేత మైసూరా రెడ్డి ఆరోపించారు. ఇతర సమస్యలతో ముడిపెట్టి చంద్రబాబు బయటపడాలని చూస్తున్నారని అన్నారు. రికార్డులోని వాయిస్ ఆయనది కాకపోతే సీబీఐ విచారణకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎలాంటి సిగ్గు లేకుండా చంద్రబాబు ఎదురుదాడి చేశారని విమర్శించారు. ఇది రాష్ట్రాల మధ్య సమస్య కాదని... వ్యక్తుల మధ్య సమస్య మాత్రమే అని చెప్పారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.