: ఫేస్ బుక్ 'అన్ ఫ్రెండ్' యాప్ తో జాగ్రత్త అంటున్న నిపుణులు


ఫేస్ బుక్ అన్న తర్వాత మిత్రులు ఏర్పడడం సహజం. మనం రిక్వెస్ట్ పెట్టడం ద్వారానో, అవతలి వైపు నుంచి వచ్చే రిక్వెస్టులను ఓకే చేయడం ద్వారానో ఫ్రెండ్స్ లిస్టు పెరిగిపోతుంది. కొన్ని కారణాలతో కొందరు ఫ్రెండ్స్ లిస్టులోని కొందరిని అన్ ఫ్రెండ్ చేస్తుంటారు. ఇలా ఎవరైనా మనల్ని అన్ ఫ్రెండ్ చేస్తే అలర్ట్ చేసేందుకు 'అన్ ఫ్రెండ్ అలర్ట్' పేరుతో ఓ ఉచిత యాప్ వాడుకలో ఉంది. అయితే, ఈ యాప్ ఏమంత క్షేమకరం కాదంటున్నారు నిపుణులు. ఈ యాప్ యూజర్ల డేటాను సేకరించడాన్ని గుర్తించామని బీటా న్యూస్.కామ్ పేర్కొంది. ఇక, అలర్ట్ డీటెయిల్స్ చూసేందుకు ఈ యాప్ సైన్ ఇన్, పాస్ వర్డ్ అడుగుతుందని, ఆ వివరాలను పొందుపరిస్తే ఆ సమాచారం నేరుగా ఫేస్ బుక్ కు వెళ్లడంలేదని, అందుకు బదులుగా yougotunfriended.com కు వెళుతోందని సెక్యూరిటీ ఫర్మ్ మాల్వేర్ బైట్స్ వివరించింది. ఈ యాప్ కొన్ని యాడ్స్ ను కూడా ప్రదర్శిస్తుందని, తద్వారా కొన్ని హానికరమైన సాఫ్ట్ వేర్లు యూజర్ల కంప్యూటర్లలో ఇన్ స్టాల్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్నింటికంటే ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, ఈ యాప్ ఫేస్ బుక్ యాప్స్ లిస్టులో కనిపించకపోవడమేనని, దాంతో, ఆ యాప్ ఉందన్న విషయాన్ని, అది మన కార్యకలాపాలను పరిశీలిస్తోందని సంగతిని సులభంగా మర్చిపోతామని వారు వివరించారు.

  • Loading...

More Telugu News