: చంద్రబాబు వెన్నంటే ఉన్న బాలయ్య
తన వియ్యంకుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ ఉదయం నుంచి ఒక్క క్షణమైనా వదిలి పెట్టలేదు. నిన్న బాబు మాట్లాడారన్నట్టుగా టేపులు బహిర్గతమైన తరువాత తీవ్ర మనస్తాపానికి గురైన బాబు ఎవరితోనూ పెద్దగా మాట్లాడటం లేదని తెలుస్తోంది. ఈ ఉదయం విజయవాడలో క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవ సమయంలోనూ ఆయన ఎవరితోనూ మాట్లాడలేదు. కనీసం మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. ఇక మరికాసేపట్లో మహాసంకల్ప సభ గుంటూరు సమీపంలో మొదలు కానున్న తరుణంలో చంద్రబాబు వేదిక వద్దకు వచ్చారు. ఈ సమయంలో కూడా బాలకృష్ణ బాబు వెంటే ఉన్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఇతర నేతలు బాబును దగ్గరుండి వేదికపైకి తీసుకొచ్చారు.