: అన్న గుండెల్లో బాణం దించిన తమ్ముడు
అన్న గుండెలో ఓ తమ్ముడు నాటు బాణం దించిన ఘటన విశాఖ జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సీలేరు మండలం తోకరాయి గ్రామంలో చోటుచేసుకుంది. గాయపడిన అన్నను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. కాగా, ఆ తమ్ముడికి మతిస్థిమితం లేదని, ఇంట్లో ఉన్న నాటు బాణాల్ని వచ్చే పోయే వాళ్ల మీద తరుచూ విసురుతుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఈ అలవాటు కారణంగానే తన అన్న మీద బాణం విసిరాడని, దీంతో ఘోరం జరిగిపోయిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తుల్లో కొంత మంది అతనిని, ఓ గదిలో నిర్బంధించి, కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. దీనిని కొంత మంది అడ్డుకోవడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.