: సముద్రంలో నుంచి చేపలు కూడా పారిపోతున్నాయట!


వాతావరణంలో వస్తున్న మార్పులు భూమిపైనున్న మనుషులనే కాదు, నీటిలో చేపలను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేసవికాలంలో ఎండ వేడిమికి నీట్లో ఉండే చేపలు కూడా తాళలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీంతో ధ్రువాలవైపుకు చేపలు తరలిపోతున్నాయి. నీరు వేడెక్కేకొద్దీ, నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుందని తద్వారా చేపల జీవక్రియలు పెరుగుతాయని, అధిక ఆక్సిజన్ అవసరమవుతుందని వారు వెల్లడించారు. సరిపడా ఆక్సిజన్ లభించకపోవడంతో చేపలు ధ్రువ ప్రాంతాలకు తరలిపోతున్నాయని పరిశోధనల్లో వెల్లడైనట్టు వారు తెలిపారు. ఈ శతాబ్దం చివరికల్లా వాతవరణ సమతుల్యం దెబ్బతినడంతో, ఉష్ణోగ్రతలు పెరిగి ఆక్సిజన్ శాతం తగ్గి చేపలు ధ్రువాలవైపుకు మరలుతాయని అన్నారు.

  • Loading...

More Telugu News