: తన ట్వీటుతో వివాదం కొనితెచ్చుకున్న మోదీ


బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను పొగడుతూ, భారత ప్రధాని మోదీ చేసిన ట్వీట్ ఆయన్ను వివాదంలోకి నెట్టింది. ఉగ్రవాదంపై హసీనా చేస్తున్న పోరును కొనియాడుతూ 'ఓ మహిళ అయినప్పటికీ' అని మోదీ ప్రస్తావించడాన్ని మహిళా సంఘాలు, ప్రముఖులు తప్పుబడుతున్నారు. రెండు రోజుల పర్యటన అనంతరం ఇండియాకు తిరిగి వచ్చిన ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఈ ట్వీట్ పెట్టారు. ఇది మహిళలను అగౌరవపరచడమేనని, ఆర్ఎస్ఎస్ భావజాలం తనలో ఇంకా మిగిలేవుందని పలువురు ట్విట్టర్ ఖాతాదారులు అభిప్రాయపడ్డారు. మరికొంత మంది మరో అడుగు ముందుకేసి పూర్వాశ్రమంలో ఆయన భార్య జశోదాబెన్ పేరునూ ప్రస్తావించారు. రాణా అయూబ్, సంజయ్ ఝా, ట్వింకిల్ ఖన్నా వంటివారు మోదీని వ్యతిరేకిస్తూ, ట్వీట్లు పెట్టారు.

  • Loading...

More Telugu News