: ఇతర బ్రాండ్ల నూడుల్స్, పాస్తా, మాకరోనీలకు కూడా ల్యాబ్ పరీక్షలు
నెస్లే కంపెనీకి చెందిన 'మ్యాగీ' నూడుల్స్ వివాదంతో ఇప్పుడు ఇతర కంపెనీల నూడుల్స్ పైన అనుమానాలు నెలకొన్నాయి. దాంతో ఐటీసీ, జీఎస్ కే కన్జ్యూమర్, రుచి ఇంటర్నేషనల్, ఇండో నిస్సిన్ కంపెనీలు తయారుచేసే నూడుల్స్, పాస్టా, మాకరోనీలపై కూడా పరీక్షలు జరపాలని పుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశాలు జారీ చేసింది.