: 'పీకూ' చూసిన రాష్ట్రపతి


భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సినిమా చూశారు. విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్న 'పీకూ' సినిమాను ఆయన కోసం రాష్ట్రపతి భవన్ లో నిన్న రాత్రి ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ తన బ్లాగులో వెల్లడించారు. రాష్ట్రపతికి సినిమాతో పాటు, సినిమాలో బెంగాలీ యాసలో ఉన్న హిందీ కూడా బాగా నచ్చిందని తెలిపారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే చక్కటి ప్రేమను, అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించారు. సుజిత్ సర్కార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో అమితాబ్, దీపికా పదుకొనేలు ప్రధాన పాత్రలను పోషించారు.

  • Loading...

More Telugu News