: "నేను చౌదరిని మాట్లాడుతున్నా, ఏం చేయాలో అదే చేస్తా"... టీ న్యూస్ కు బెదిరింపు కాల్స్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో మాట్లాడినవంటూ ఆడియో టేపులను టీ న్యూస్ చానెల్ ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి ట్యాంక్ బండ్ పై జరిగిన తెలంగాణ రాష్ట్ర వేడుకల ప్రసారాలను నిలిపివేసిన టీ న్యూస్ చానెల్ ఆడియో టేపులను ప్రసారం చేసింది. దీంతో, తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో, తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ టీ న్యూస్ యాజమాన్యం వెల్లడించింది. "నేను చౌదరిని మాట్లాడుతున్నా... ఏం చేయాలో అదే చేస్తా" అంటూ బెదరించారని 'టీ న్యూస్' వివరించింది.