: టీడీపీని, చంద్రబాబును ఎవరూ ఏమీ చేయలేరు: మోత్కుపల్లి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబును, టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. కేసీఆర్ దిగజారి ప్రవర్తిస్తున్నారని, ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన మోత్కుపల్లి, టీఆర్ఎస్ బెదిరింపు రాజకీయాలను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని హెచ్చరించారు. టీడీపీ సభ్యులను ప్రలోభపెట్టి పార్టీలోకి చేర్చుకున్నారని, మీ పార్టీ వారితో సంప్రదించకుండానే టీడీపీ సభ్యులు పార్టీ మారారా? అని ప్రశ్నించారు. కాగా, ప్రొఫెసర్ జయశంకర్ చరిత్రను పాఠ్యాంశాల్లో ఎందుకు చేర్చలేదని, తాము అధికారంలోకి వస్తే పాఠ్యపుస్తకాల్లోంచి కేసీఆర్ చరిత్ర తొలగిస్తామని చెప్పారు.