: రూ. 21.2 కోట్లకు పెరిగిన టీసీఎస్ చీఫ్ వేతనం


దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఎన్ చంద్రశేఖరన్ వేతనం 2015 ఆర్థిక సంవత్సరంలో రూ. 21.28 కోట్లకు పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 18 శాతం అధికం. భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో, ఇన్ఫోసిస్ లో విశాల్ శిక్కా చేరక పూర్వం వరకూ చంద్రశేఖర్ దే అత్యధిక వేతనం. కాగా, శిక్కాకు రూ. 30 కోట్ల వేతనం ఆఫర్ చేసినట్టు ఇన్ఫీ ఇప్పటికే వెల్లడించింది. చంద్రశేఖరన్ కు జీతం రూపంలో రూ. 1.79 కోట్లు, భత్యంగా రూ. 2.62 కోట్లు, ఇతర లాభాల రూపంలో రూ. 86 లక్షలు, కమిషన్ గా రూ. 16 కోట్లు లభించాయని సంస్థ వెల్లడించింది. గత సంవత్సరం ఆయనకు ఏ విధమైన స్టాక్ ఆప్షన్లూ ఇవ్వలేదని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News