: రేవంత్ ది తప్పో, ఒప్పో చంద్రబాబే చెప్పాలి: కేటీఆర్ డిమాండ్


ఓటుకు నోటు కేసులో సీక్రెట్ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డిది తప్పో, ఒప్పో చెప్పాల్సిన బాధ్యత ఆ పార్టీ అధినేతగా నారా చంద్రబాబునాయుడుపైనే ఉందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన కేటీఆర్... రేవంత్ రెడ్డి చేసింది తప్పో, ఒప్పో చంద్రబాబు తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు. ఇక చంద్రబాబు ఆడియో టేపులపై ఏపీలో జరుగుతున్న ఆందోళనలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ పెద్దలపై ఏపీలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేయిస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడవద్దని ఆయన టీడీపీ నేతలకు సూచించారు.

  • Loading...

More Telugu News