: చంద్రబాబు ఫోన్ ను ట్యాపింగ్ చేయలేదు: వేణుగోపాలాచారి
ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి ఓటుకు నోటు కేసుకు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఫోన్ ను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేయలేదని ఆయన ప్రకటించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ సెల్ ఫోన్ లో రికార్డింగ్ ద్వారా చంద్రబాబు ఆడియో టేపును స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే కొనుగోలుకు బరితెగించిన టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయేసరికి మాట మార్చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ అవినీతి తంతుకు సంబంధించిన కేసును ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య వివాదంగా కలరింగ్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టించాలనే కుట్రతోనే టీడీపీ నేతలు ఈ వ్యవహారంపై రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.