: అత్యంత క్లిష్టమైన కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభం


కైలాస మానస సరోవర యాత్ర నేటి నుంచి మొదలు కానుంది. ఈ సంవత్సరం రెండు వైపుల నుంచి కైలాస పర్వతానికి యాత్ర ఉంటుందని, సోమవారం నుంచి లిపులేక్ పాస్ ద్వారా యాత్ర ప్రారంభమవుతుందని, 18 నుంచి సిక్కిం, చైనాల మీదుగా నాథుల్లా పాస్ ద్వారా యాత్ర మొదలవుతుందని విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. నాథుల్లా పాస్ ద్వారా వెళ్తే కొంత వ్యయమైనా ప్రయాస తగ్గుతుందని వివరించారు. లిపులేక్ పాస్ ద్వారా రూ. 1.5 లక్షలు, నాథుల్లా పాస్ ద్వారా రూ. 1.7 లక్షల రూపాయలు ఖర్చవుతాయని అధికారులు తెలిపారు. పాత రూట్లో బ్యాచ్ కి 60 మంది చొప్పున 18 బ్యాచ్ లు, కొత్త రూట్లో 50 మంది చొప్పున 5 బ్యాచ్ లు వెళ్తాయని వివరించారు. సాక్ష్యాత్తూ పరమ శివుడు కైలాస పర్వతంపై ఉంటాడని హిందువుల నమ్మకం. ఈ యాత్ర అత్యంత సంక్లిష్ట వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సాగుతుంది కాబట్టి, ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేనివారిని మాత్రమే అనుమతిస్తారన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News