: వెంకయ్య నెల్లూరు బొమ్మిడాయి చేపలా జారిపోతున్నారు: సీపీఐ నారాయణ


కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విచిత్ర వ్యాఖ్య చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకుంటానన్న ఆయన, నెల్లూరు బొమ్మిడాయి చేపలా జారిపోతున్నారన్నారు. ఈ మేరకు నెల్లూరు జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో హోదా కల్పిస్తామన్న ప్రధానమంత్రి మోదీ అసలిప్పుడా ఊసే ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వంపైనా నారాయణ విమర్శలు చేశారు.

  • Loading...

More Telugu News