: నిజంగా అవి చంద్రబాబు టేపులైతే... కోర్టుకు ఇవ్వకుండా మీడియాకు ఎలా ఇస్తారు?: ఎర్రబెల్లి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏసీబీ డీజీలా వ్యవహరిస్తున్నారని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. విభజన చట్టాన్ని కేసీఆర్ ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. టేపుల్లో ఉన్నది చంద్రబాబు వాయిస్ కాదని... ఒకవేళ అదే నిజమైతే, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ను కేసీఆర్ ఎలా ట్యాప్ చేయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టేపులను కోర్టుకు అందజేయాలే గాని... మీడియాకు ఎలా ఇస్తారని నిలదీశారు. కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ రూ. 3 కోట్లు ఇస్తానని వైకాపా ఎమ్మెల్యేని ప్రలోభపెట్టినట్టు పోలీసులు చెప్పారని... ఆయనపై ఇంకా కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.