: ఉగ్రవాదులు, తీవ్రవాదులపై పెట్టే నిఘాను... ముఖ్యమంత్రిపై పెడతారా?: పయ్యావుల ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే... కేసీఆర్ మాత్రం విచ్ఛిన్నకర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉగ్రవాదులు, తీవ్రవాదుల కార్యకలాపాలపై పెట్టాల్సిన నిఘాను, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అత్యంత నీచమని అన్నారు. వైకాపా అధినేత జగన్ తో కుమ్మక్కైన కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని... ఇలాంటి వాటిని తాము ఎదుర్కొంటామని చెప్పారు.