: ఆన్ లైన్లో అతిపెద్ద లావాదేవీ ఇదే... స్నాప్ డీల్ లో రూ. 1,10,00,000 డీల్


ఆన్ లైన్ లావాదేవీలు, ఈ-కామర్స్ సైట్ల ద్వారా జరుగుతున్న వాణిజ్యం ఇండియాలో శరవేగంగా విస్తరిస్తోందనడంలో సందేహం లేదు. అయితే, ఒక ఆన్ లైన్ లావాదేవీలో ఎంత మొత్తం పెట్టి వస్తువును కొంటాం? దీనికి చాలా మంది సమాధానం వెయ్యి రూపాయల్లోపనో, ఓ స్మార్ట్ ఫోన్ కొంటే 20 నుంచి 25 వేల వరకూ వెచ్చిస్తామనో చెబుతారు. రూ. లక్షకు పైగా విలువైన లావాదేవీ రోజుకు ఒక్కటి కూడా నమోదుకాక పోవచ్చు. అటువంటిది స్నాప్ డీల్ లో రూ. 1.10 కోట్ల డీల్ జరిగింది. టాటా హౌసింగ్ నిర్మించిన గృహాలను ఆన్ లైన్లో అమ్మకానికి పెడితే, ఓ ఔత్సాహికుడు ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని స్నాప్ డీల్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ మహేశ్వరి వివరించారు. టాటా హౌసింగ్ గృహాలను సరసమైన ధరలకు తాము ఆఫర్ చేస్తున్నట్టు వివరించారు. ఆగస్టు 2014లో రియల్ ఎస్టేట్ కేటగిరీని ప్రారంభించిన తరువాత వివిధ రకాల ధరల్లో వందకు పైగా యూనిట్లను విక్రయించామని తెలిపారు. టాటా హౌసింగ్ తో పాటు డీఎల్ఎఫ్, శోభా డెవలపర్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, మంత్రి డెవలపర్స్, పుర్వాంకరా తదితర సంస్థల ప్రాజెక్టుల్లోని ప్లాట్లు, ఫ్లాట్లను తాము ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News