: బీహార్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు స్వతంత్రంగా పోటీ చేయాలి: పప్పు యాదవ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీ చేయాలనుకుంటున్న ఆర్జేడీ, జేడీ(యూ)ల సంకీర్ణ కూటమిపై రాష్ట్రీయ జనతాదళ్ బహిష్కృత నేత పప్పు యాదవ్ మండిపడుతున్నారు. గెలుస్తామన్న నమ్మకం ఉంటే వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని యాదవ్ డిమాండ్ చేశారు. వారు తమ పొత్తు గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. కాగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లు దళితులకు మొదటి శత్రువులని నిన్న (ఆదివారం) యాదవ్ ఆరోపించారు. జనతా పరివార్ ఏర్పాటువల్ల ఎలాంటి ఉపయోగంలేదని విమర్శించారు.