: దాశరథి మృతికి చంద్రబాబు సంతాపం... రేపు అంత్యక్రియలు
ప్రముఖ సాహితీవేత్త దాశరథి రంగాచార్య మృతిపట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం ప్రకటించారు. సాహితీ ప్రక్రియల్లో దాశరథి చేసిన కృషి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిందని కొనియాడారు. మరోవైపు ఆయన భౌతికకాయాన్ని సోమాజీగూడలోని యశోదా ఆసుపత్రి నుంచి వెస్ట్ మారేడుపల్లిలోని ఆయన స్వగృహానికి తరలించారు. దాశరథి అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం 12 గంటలకు మారేడుపల్లి శ్మశానవాటికలో నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు విరంచి తెలిపారు. వారం క్రితమే తన తండ్రి అస్వస్థతకు గురయ్యారని, బీపీ, చక్కెర నిల్వలు పెరిగిపోయాయని వివరించారు.