: ఆడియో టేపులతో ఏపీని దెబ్బతీయాలని చూస్తున్నారు: ధూళిపాళ్ల


ఓటుకు నోటు కేసులో సంభాషణలకు సంబంధించిన ఆడియో టేపులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడంపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, జీవి ఆంజనేయులు మండిపడుతున్నారు. వాటితో ఏపీ ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. కోర్టుకు అప్పగించామన్న టేపులు బయటకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ తో ఏపీ సీఎంకు అభ్రదతా భావం కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. గుంటూరులో ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిస్తే తెలంగాణకు పెట్టుబడులు వస్తాయని కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ నటనకు కథ, దర్శకత్వం కేసీఆర్ దేనని విమర్శించారు. ఇప్పటికైనా సెక్షన్-8తో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ధూళిపాళ్ల, ఆంజనేయులు కోరారు.

  • Loading...

More Telugu News