: దమ్ముంటే లైడిటెక్టర్ పరీక్షలకు రా... నేనూ వస్తా: చంద్రబాబుకు కేటీఆర్ సవాల్


ఓటుకు నోటు వ్యవహారంలో ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలు రెండు రాష్ట్రాల మధ్య సమస్య కాదని తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు టీవీ చానళ్ల ముందు లైడిటెక్టర్ పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమని, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా అందుకు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు. ఈ మొత్తం ఉదంతాన్ని తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సమస్యగా సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. బాబు, టీడీపీ అవినీతి చేష్టలు బట్టబయలు అయ్యాయని, ఆయనకు దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని ట్విట్టర్ లో డిమాండ్ చేశారు. ట్విట్టర్ లో కేటీఆర్ ఏమన్నారంటే... "If CBN has the guts, I dare him to accept my challenge: I am willing to take a lie-detector test live on TV, Are you ready for one?" "No matter how hard CBN & his cronies try, issue at hand is corrupt practices of TDP & its president. Issue is NOT between Telangana & AP"

  • Loading...

More Telugu News