: సంబురాల్లో కేసీఆర్ ఉత్సాహం... లడ్డూలను స్వయంగా పంపిణీ చేసిన వైనం
తెలంగాణ తొలి ఆవిర్భావ వేడుకల్లో మొన్నటిదాకా ఆ రాష్ట్ర మంత్రులు డప్పు కొట్టి దరువేస్తే, ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ఉత్సాహం చూపారు. నిన్న ట్యాంక్ బండ్ వేదికగా జరిగిన ముగింపు వేడుకల్లో కేసీఆర్ స్వయంగా లడ్డూలను పంపిణీ చేశారు. లడ్డూల పాత్రను చేతులతో పట్టుకున్న ఆయన ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులకు స్వయంగా అందజేశారు. అంతటితో ఆగని ఆయన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా నోటికి లడ్డూను అందించారు.