: ప్రముఖ సాహితీవేత్త దాశరథి రంగాచార్య కన్నుమూత
ప్రముఖ సాహితీవేత్త దాశరథి రంగాచార్య(87) కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. సికింద్రాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే దాశరథి కన్నుమూశారు. వరంగల్ జిల్లా చినగూడురుకు చెందిన దాశరథి రంగాచార్య అభ్యుదయ రచయితగానే కాక తెలంగాణ సాయుధ పోరాట యోధుడిగా కూడా ప్రస్థానం సాగించారు. చిల్లరదేవుళ్లు, మోదుగుపూలు, జనపథం నవలలతో దాశరథి ప్రఖ్యాతిగాంచారు. ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్యకు ఈయన సోదరుడు.