: ఉన్నతాధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు అత్యవసర సమావేశం
_7522.jpg)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన నివాసంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. టి.వి న్యూస్ ఛానల్స్ లో కథనాలు ప్రసారం అవడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అవుతోంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు సంభాషణలను ప్రసారం చేయడంపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కథనాలపై చంద్రబాబు తన నివాసంలో అధికారులతో చర్చిస్తోన్నట్లు సమాచారం. తాజా పరిణామాలపై సీఎస్, డీజీపీ సహా ముఖ్య అధికారులతో చంద్రబాబు సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది.