: రేవంత్ కు సరైన సౌకర్యాలు కల్పించండి... అధికారులను ఆదేశించిన ఏసీబీ డీజీ ఏకే ఖాన్
తెలంగాణ ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ను టీటీడీపీ నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా, ఏసీబీ కస్టడీలో ఉన్న తమ సహచరుడు రేవంత్ రెడ్డికి సరైన సౌకర్యాలు కూడా కల్పించకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. సౌకర్యాలు లేకపోవడంతో రేవంత్ అనారోగ్యానికి గురయ్యారని... బాడీ పెయిన్స్, జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన ఏకే ఖాన్... వెంటనే రేవంత్ రెడ్డికి సరైన సౌకర్యాలను కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.