: తిరుమలలో దారుణం... ఇద్దరు మహిళలపై కత్తితో దాడి


ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో దారుణం చోటు చేసుకుంది. సీఆర్వో (సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్) దగ్గరున్న ఓ హోటల్లో ఇద్దరు మహిళలపై శివ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దారుణానికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న టూ టౌన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News