: రేవంత్ కు 60 ప్రశ్నలను సంధించిన ఏసీబీ... గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్న రేవంత్
టీటీడీపీ నేత రేవంత్ రెడ్డిపై ఏసీబీ అధికారుల రెండో రోజు విచారణ ముగిసింది. ఈ సందర్భంగా, ఈ రోజు రేవంత్ రెడ్డికి 50 నుంచి 60 ప్రశ్నలను ఏసీబీ అధికారులు సంధించారు. ఈ క్రమంలో, విచారణకు రేవంత్ పూర్తిగా సహకరించారని ఆయన తరపు న్యాయవాది సుధీర్ తెలిపారు. విచారణ ముగిసిన అనంతరం రేవంత్ ను సిట్ కార్యాలయానికి తరలించారు. అయితే, సిట్ కార్యాలయంలో సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో, రేవంత్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం రేవంత్ ఆరోగ్యం కొంచెం ఆందోళనకరంగానే ఉందని సుధీర్ తెలిపారు. సిట్ లో సరైన సౌకర్యాలు లేవన్న విషయాన్ని ఏసీబీ అధికారులకు రేవంత్ ఫిర్యాదు చేశారు. మరోవైపు, రేవంత్ కు ఏసీబీ సరైన సౌకర్యాలు కూడా కల్పించని విషయాన్ని రేపు కోర్టు దృష్టికి తీసుకెళతామని సుధీర్ తెలిపారు.