: టీఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు: కవిత
టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తముందని... ఈ వ్యవహారాన్నంతా ఆయనే వెనకుండి నడిపించారని టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆరోపించారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1 నిందితుడిగా చేర్చాలని అన్నారు. ప్రతి కేసులో సీబీఐ విచారణకు డిమాండ్ చేసే చంద్రబాబు... రేవంత్ విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.