: రేణుదేశాయ్ మేనల్లుడి స్కూలు నిర్వాకం... పుస్తకాలపై శిల్పాశెట్టి, సన్నీలియోన్, బిపాసాల ఫొటోలు
ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మేనల్లుడు పూణేలోని ఓ ప్రముఖ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అతనికి ఆ స్కూల్ మేనేజ్ మెంట్ వాళ్లు ఇచ్చిన పుస్తకాలపై అభ్యంతరకరంగా ఉన్న శిల్పాశెట్టి, సన్నీలియోన్, బిపాసాబసుల ఫొటోలు ముద్రించి ఉన్నాయి. ఈ అంశంపై స్కూలు యాజమాన్యాన్ని కుటుంబసభ్యులు ప్రశ్నించారు. దీనికి వారు ఏం సమాధానం చెప్పారో తెలుసా? "టీవీల్లో వీరందరినీ పిల్లలు చూస్తున్నారు కదా. పుస్తకం మీద చూస్తే తప్పేంటి"... ఇదీ వారిచ్చిన సమాధానం. ఈ విషయాన్ని రేణుదేశాయ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పక్కనున్న శిల్పాశెట్టి ఫొటో స్కూలు పుస్తకం మీద ముద్రించిందే. ఇలాంటి ఫొటోలు చూస్తూ కూర్చుంటే... క్లాస్ రూమ్ లో చెప్పేది విద్యార్థుల తలకు ఎక్కుతుందా?