: నాకు, నామా నాగేశ్వరరావుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి: టీడీపీ ఎమ్మెల్యే సండ్ర


ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. వాయిస్ రికార్డులు ఉన్నాయంటూ తనకు, టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. తెలంగాణలోని టీడీపీ ఎమ్మెల్యేల మానసిక స్థితిని దెబ్బతీయడానికే ఈ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. కొన్ని పత్రికలు, టీవీ చానల్స్ కూడా ఈ కుట్రలకు తమవంతు సహకారం అందిస్తున్నాయని విమర్శించారు. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలు ఈ కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. తాను పెద్దల ఇంట్లో పాలేరును కాదని... తనకు కూడా ఆత్మగౌరవం ఉందని... అందుకే ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగానని చెప్పారు. రేవంత్ రెడ్డి కేసులో మరి కొందరు టీడీపీ నేతలకు కూడా ప్రమేయం ఉందన్న నేపథ్యంలో, సండ్ర పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News