: ఏసీబీ విచారణలో అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం చెబుతున్న రేవంత్
టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ముడుపులు ఇచ్చిన వ్యవహారంలో రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారించారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు రేవంత్ రెడ్డి ఒకటే సమాధానం చెబుతూ వచ్చారని సమాచారం. దీంతో, ఏసీబీ అధికారుల విచారణ ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. కొన్ని ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా రేవంత్ మౌనం వహించారని... కొన్ని సందర్భాల్లో విచారణ అధికారుల పట్ల అసహనం ప్రదర్శించారని సమాచారం. మరోవైపు కేసులో ఏ-2, ఏ-3లు అయిన సెబాస్టియన్, ఉదయ్ సింహలను కూడా విచారించారు.