: కాసేపట్లో గవర్నర్ ను కలవనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో గవర్నర్ నరసింహన్ తో సమావేశం కాబోతున్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు అక్కడ నుంచి హైదరాబాద్ చేరుకోగానే, నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి, గవర్నర్ తో భేటీ కానున్నారు. 9వ తేదీన నరసింహన్, చంద్రబాబులు ఢిల్లీ వెళుతున్నారు. 12న కేసీఆర్ హస్తిన పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో, వీరిరువురి సమావేశంపై ఆసక్తి నెలకొంది. వీరి సమావేశంలో టి.పోలీస్ చేసిన ఫోన్ ట్యాపింగ్, రేవంత్ కేసు అంశాలు చర్చకు రానున్నట్టు సమాచారం.