: ఆయన ఇక్కడకు వచ్చుంటే, మరింత అద్భుతంగా ఉండేది: మోదీ
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి ఈ రోజు బంగ్లాదేశ్ అత్యున్నత పురస్కారం 'బంగ్లాదేశ్ లిబరేషన్ వార్'ను ప్రదానం చేశారు. వాజ్ పేయి తరపున భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ హమీద్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, "వాజ్ పేయి ఒక ఆదర్శం. ఎంతో మంది ఆయనలా ఉండాలని కోరుకుంటారనుకోవడంలో సందేహం లేదు. ఆయనే ఇక్కడకు వచ్చుంటే... ఈ వేడుక మరోలా, మహా అద్భుతంలా ఉండేది" అని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ అధ్యక్ష నివాసం 'బంగబంధు భవన్'లో ఈ కార్యక్రమం జరిగింది.