: తెర వెనుక జరిగిన వాటితో జగన్ కు సంబంధం ఉందని నేనెప్పుడూ అనలేదు: బొత్స
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ మంత్రవర్గం సమష్టిగా తీసుకున్నవే అని వైకాపా నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెర వెనుక జరిగిన వాటితో తమకు సంబంధం లేదని అప్పుడే చెప్పానని... ఇప్పుడు కూడా అదే చెబుతున్నానని తెలిపారు. ఈ వ్యవహారాలతో వైకాపా అధినేత జగన్ కు సంబంధం ఉందని తాను ఎన్నడూ అనలేదని చెప్పారు. అయినా, ఆ విషయం కోర్టులో ఉందని అన్నారు. మీడియాలో అనేక కథనాలు వస్తుంటాయని, వాటిని తనపై రుద్దవద్దని కోరారు.